పట్నా: తమ కుటుంబ సమస్యల్లో అతిగా జోక్యం చేసుకోవడం అనవసరపు చర్యగా అభివర్ణించారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్,. తమ కుటుంబ సమస్యలపై దృష్టి ఆపి ఎవరి పని వారి చేసుకుంటే మంచిదని హితవు పలికారు,. ప్రధానంగా పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ.. లాలూ ఫ్యామిలీ సమస్యలను పార్టీ వరకూ తీసుకెళ్లడం తగదన్నారు. అంతర్గత కలహాలపై కాకుండా, పార్టీ ఐక్యత , పార్టీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇక్కడ పార్టీ అనేది ప్రధానంగా కాబట్టి కార్యకర్తలు ఆ వ్యవహారాలపై దృష్టి నిలపాలన్నారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టడంపైనే కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ‘ ఇది మా కుటుంబ సమస్య. ఆ సమస్యలను నేను డీల్ చేసుకుంటా. నేను ఉన్నా.. అంతా చూసుకుంటా’ అని స్పష్టం చేశారు.
పాట్నాలో జరిగిన పార్టీ శాసనసభ్యులసమావేశంలో తేజస్వి యాదవ్‌ను ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు.
లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది.
ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ శ్రేణులు కూడా లాలూ ప్రసాద్ కుటుంబం చీలికపై తీవ్ర దృష్టి నిలిపాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు లాలూ తనదైన శైలిలో దిశా నిర్దేశం చేస్తూ ..అంత సెట్ అవుతుందని, తమ కుటుంబ రచ్చ వ్యవహారంలోకి పోకుండా పార్టీని మెరుగుపరచడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


