భారీ ఎన్‌కౌంటర్‌లో సిగ్మా గ్యాంగ్‌ ఖతం! | Delhi Rohini Encounter News Sensational Details Updates | Sakshi
Sakshi News home page

Delhi Encounter: భారీ ఎన్‌కౌంటర్‌లో సిగ్మా గ్యాంగ్‌ ఖతం

Oct 23 2025 7:03 AM | Updated on Oct 23 2025 8:26 AM

Delhi Rohini Encounter News Sensational Details Updates

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలోని రోహిణి ప్రాంతంలో గత అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్‌(Delhi Encounter) జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన సిగ్మా గ్యాంగ్‌ సభ్యులు నలుగురు మరణించారు. వీళ్లలో ఆ ముఠా నాయకుడు, మోస్ట్‌ వాంటెడ్‌ రంజన్‌ పాఠక్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

బీహార్‌లో సిగ్మా గ్యాంగ్‌(Sigma Gang Encounter) గత కొంతకాలంగా తీవ్ర నేరాలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్‌ హత్యలు, దోపిడీలు, ధమ్కీలు ఇస్తూ.. సీతామఢి జిల్లా కేంద్రంగా ఈ ముఠా తమ కార్యకలాపాలు సాగిస్తోంది.  పైగా పోలీసుల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామంటూ ప్రకటనలు ఇచ్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో.. ఈ గ్యాంగ్‌ కీలక సభ్యుడు రంజన్‌ పాఠక్‌పై పోలీసులు నజరానా కూడా ప్రకటించారు. బ్రహ్మర్షి సేన మాజీ నేత గణేశ్‌ శర్మ హత్య కేసులో ఈ గ్యాంగ్‌ పేరు వినిపించింది కూడా. ఈలోపు.. 

బీహార్‌ ఎన్నికల టైంలో సిగ్మా గ్యాంగ్‌ మరింత రెచ్చిపోతానని, దమ్ముంటే పట్టుకోవాలంటూ.. బీహార్‌ పోలీసులను సవాల్‌ చేస్తూ రంజన్‌ పాఠక్‌ ఓ ఆడియో క్లిప్‌ వదిలాడు. దీంతో ఈ చాలెంజ్‌ను ఇజ్జత్‌కాసవాల్‌గా తీసుకున్న బీహార్‌ పోలీసులు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ సాయంతో స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. గత కొన్నివారాలుగా ఈ జాయింట్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగా.. ఢిల్లీ శివారుల్లో ముఠా కదలికలను గుర్తించారు.

బుధవారం అర్ధరాత్రి దాటాక(2గం. ప్రాంతంలో) రోహిణిలోని బహదూర్‌ షా మార్గ్‌ వద్ద సిగ్మా గ్యాంగ్‌ తారసపడింది. ముఠా సభ్యులు కాల్పులకు దిగడంతో పోలీసులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఎదురు కాల్పులకు దిగారు. బుల్లెట్‌ గాయాలైన నలుగురిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

రంజన్‌ పాఠక్‌తో పాటు మృతుల్లో  బిమ్లేశ్ మాహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ కూడా ఉన్నారు. కీలక సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో సిగ్మా గ్యాంగ్‌ పని ఖతమై ఉంటుందని బీహార్‌ పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement