పట్నా: బిహార్‌లో ఎన్డీయే బంపర్ మెజారిటీ సాధించింది. సీఎం నితీశ్ కేబినెట్‌లో ఒకే ఒక్కరు తప్ప మొత్తం 25 మంది మంత్రులు విజయతీరాలకు చేరారు. డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా గెలిచారు. బీజేపికి చెందిన మొత్తం 15 మంది గెలిచారు. వీరిలో వ్యవసాయ మంత్రి ప్రేమ్ కుమార్ వరుసగా 8వ సారి గెలిచారు. మరి ఓడిందెవరు? సుమిత్ కుమార్ సింగ్. ఈయన 2020లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
ఈసారి జేడీయూ టికెట్‌పై జముయి జిల్లా చకాయ్ స్థానంలో పోటీ చేసి, ఓడిపోయారు. సుమారు 13 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన సావిత్రీ దేవి చేతిలో పరాజయం చవిచూశారు. ఐదేళ్ల క్రితం సుమిత్ ఈమెనే ఓడించారు. దివంగత మాజీ మంత్రి, సీఎం నితీశ్ సన్నిహితుడైన నరేంద్ర సింగ్ కుమారుడే సుమిత్. మొన్నమొన్నటి వరకు సైన్స్, టెక్నాలజీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు.


