బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలకు సైతం అందకుండా 202 సీట్లు సాధించి భారీ విజయం సాధించింది. మహాగఠ్ బందన్ కేవలం 35 సీట్లకే పరిమితమయి ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది, బీజేపీ, జేడీయూలను పక్కకు నెట్టి ఆర్జేడీ ప్రథమ స్థానంలో నిలిచింది.
బిహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏకు చెక్ పెట్టాలని ఇండియా కూటమి భావించించి. దాని కనుగునంగానే బిహార్ లో ప్రచారం హోరెత్తించింది. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సైతం ఈఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. అయితే ఫలితాలు మాత్రం ఇండియా కూటమిని కంగుతినేలా చేశాయి. ఎగ్జిట్ ఫోల్స్ అంచనాల కంటే తక్కువగా మహాగఠ్ బంధన్‌ని కేవలం 35 సీట్లకే పరిమితం చేసింది. ఐతే ఈ ఎన్నికల్లో ఓట్ల షేర్ పరంగా చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ అవతరించింది. 23 శాతం ఓట్లషేర్ సాధించి టాప్ ప్లేసులో నిలిచింది.
ఐతే సీట్ల పరంగా చూస్తే కేవలం 25 స్థానాలకే పరిమితమయింది. 20.8 ఓట్లశాతం సాధించిన బీజేపీ 89 స్థానాలు గెలుచుకోగా,19.5 శాతం ఓట్లు సాధించిన జేడీయూ 85 సీట్లు గెలుచుకుంది 8.71 శాతం ఓట్ల షేర్ తో కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది. కేవలం 1.85ఓట్ల షేర్ సాధించిన ఎంఐఎం 5 స్థాన్లాలో గెలవడం విశేషం. గతసారి జరిగిన ఎన్నికల్లో 23.11 శాతం ఓట్ల షేర్ సాధించిన ఆర్జేడీ 73 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి మాత్రం 23 శాతం ఓట్ల షేర్ సాధించినప్పటికీ కేవలం 25 స్థానాలకే పరిమితమయ్యింది.


