breaking news
rishabh
-
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. రెండు పతకాలు ఖాయం
సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలో కూడిన భారత పురుషల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.తొలి రౌండ్లో భారత బృందానికి బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో సెకెండ్ రౌండ్లో ఇండియన్ టీమ్‌కు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత సమయంలో రెండు జట్ల పాయింట్లు 232-232 సమం కావడంతో షూట్-ఆఫ్ నిర్వహించారు. షూట్-ఆఫ్‌లో 30-28 తేడాతో భారత్ విజయం సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో యూఎస్‌పై (234-233) ఒక్క పాయింట్ తేడాతో భారత్ గెలుపొందింది. క్వార్టర్స్‌లో భారత్ ఆరంభం నుంచి వెనకబడి ఉన్నప్పటికి ఆఖరిలో ఆర్చర్లు అద్భుతాలు చేయడంతో యూఎస్‌పై పైచేయి సాధించింది.ఇక సెమీఫైనల్లో మూడవ సీడ్ టర్కీ(234-232 )ని రెండు పాయింట్ల తేడాతో ఓడించి తమ ఫైనల్ బెర్త్‌ను టీమిండియా ఖారారు చేసుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను భారత్ బృందం ఎదుర్కొనుంది. భారత్ ఫైనల్ చేరడంలో రిషబ్ యాదవ్‌ది కీలక పాత్ర. క్వాలిఫయింగ్ రౌండ్లో 709 పాయింట్లతో భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్.. క్వార్టర్స్, సెమీస్‌లోనూ సత్తాచాటాడు.ఆ తర్వాత రిషబ్ యాదవ్.. వెన్నం జ్యోతీ సురేఖతో కలిసి కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో చైనీస్ తైపీపై 157-155 పాయింట్లతో తేడాతో ఈ భారత ద్వయం విజయం సాధించింది. ఆదివారం ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనున్నారు. -
రిషభ్ యాదవ్‌కు కాంస్యం
చెంగ్డూ (చైనా): భారత యువ ఆర్చర్ రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. ప్రపంచ క్రీడల్లో శనివారం జరిగిన పోటీల్లో మిగతా ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో జరిగిన కాంస్య పతక పోరులో 22 ఏళ్ల రిషభ్ 149–147 స్కోరుతో భారత సీనియర్ సహచరుడు అభిషేక్ వర్మపై గెలుపొందాడు. తొలి సెట్లో కచి్చతమైన గురితో పదికి పది పాయింట్లు సాధించడంతో రిషభ్ 30–29తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండు, మూడు సెట్లలో ఇద్దరు 29–29, 30–30 స్కోర్లు చేశారు. మళ్లీ నాలుగో సెట్లో రిషభ్ గురి అదరడంతో 30–29 స్కోరు సాధించాడు. దీంతో మొత్తం 119–117తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆఖరి సెట్లో ఇద్దరు 30–30 స్కోరు సాధించడంతో రిషభ్‌కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో అతను 145–147తో రెండు పాయింట్ల తేడాతో అమెరికన్ ఆర్చర్ కుర్టిస్ లి బ్రాడ్‌నాక్స్ చేతిలో ఓడిపోగా, అభిషేక్ వర్మ 145–148తో టాప్ సీడ్ మైక్ ష్లోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ పోటీల్లో భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 12వ సీడ్ పర్నిత్ కౌర్ 140–145తో కొలంబియాకు చెందిన నాలుగో సీడ్ అలెజాండ్రా వుస్క్వియానో చేతిలో, మూడో సీడ్ మధుర ధమన్గొంకర్ 145–149తో ఆరో సీడ్ లీసెల్ జాట్మా (ఈస్తోనియా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అభిషేక్ వర్మ–మధుర జోడీ నిరాశపరిచింది. అనూహ్యంగా తొలిరౌండ్లోనే భారత ద్వయం 151–154తో దక్షిణ కొరియాకు చెందిన మూన్ యియున్–లీ వున్హో చేతిలో కంగుతింది. మిక్స్డ్ రికర్వ్‌లో భారత జోడీలు బరిలోకి దిగలేదు. -
జ్యోతి సురేఖరిషభ్ జోడీ ప్రపంచ రికార్డు
మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), రిషభ్ యాదవ్ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్‌లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్థియెన్–మథియాస్ ఫులర్టన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్‌లో రిషభ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్లో సురేఖ బృందం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందింది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్ సాల్వడోర్ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది. -
ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదు
సాక్షి, హైదరాబాద్: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటి లో ఒకటిగా భావించే కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజ యవంతంగా పూర్తిచేసినవారికి అద్భుతమైన కెరీర్ ఆహ్వనం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న కోర్సులో చేరి 22 ఏళ్ల వయసులోనే దానిని పూర్తి చేయటమే కాకుండా.. ఈ నెల 26న ఐసీఏఐ విడుదల చేసిన ‘ఫైనల్’ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.. పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్. తన విజయానికి హార్డ్ వర్క్, ప్లానింగే కీలకంగా నిలిచాయని చెబుతున్న రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే... రాజస్తాన్ నుంచి పలమనేరుకు.. రాజస్తాన్‌కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్లోనే సాగింది. 2018లో ఐసీఎస్ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్లో 96.8% మార్కులతో ఉత్తీర్ణత సాధించాను సీఏ దిశగా ఇలా..ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మిడియట్‌లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టీకల్íÙప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టీకల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్‌లో పరీక్షలకు హాజరయ్యాను. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీఏంఏ కూడా.. సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను. డైలీ ప్లానింగ్సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.‘సాక్షి’ స్పెల్–బి మెడల్ స్కూల్లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్‌కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో ర్యాంకు సాధించాను. -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
ప్రయోగాలకు వేళాయె!
♦ మార్పులపై కెప్టెన్ కోహ్లి దృష్టి ♦ రిషభ్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చోటు? ♦ నేడు వెస్టిండీస్‌తో నాలుగో వన్డే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు ఇక ప్రయోగాలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మిడిలార్డర్లో తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో పరీక్షించుకోవాల్సి ఉంది. ఇప్పటికే మూడో ఓపెనర్‌గా ఉన్న రహానే భీకర ఫామ్‌ను చాటుకుంటుండటంతో మిడిలార్డర్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. అలాగే ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ కూడా దక్కించుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): ఏ మాత్రం పోటీనివ్వలేకపోతున్న ప్రత్యర్థి వెస్టిండీస్‌పై తమ ప్రయోగాలకు ఇదే సరైన అవకాశమని భారత జట్టు భావిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయం కూడా ఇలాగే ఉండటంతో.. నేడు (ఆదివారం) వెస్టిండీస్‌తో జరిగే నాలుగో వన్డేలో ఏదో ఒక మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక జట్టుకు ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ ఖాయమవుతుంది. మరో మ్యాచ్ కూడా మిగిలి ఉండటంతో రిజర్వ్ బెంచ్‌ను బరిలోకి దింపాలని కెప్టెన్ భావిస్తున్నాడు. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి కావడంతో విండీస్ తమ స్థాయికి మించి ఆడి ఏమేరకు ఆడుతుందో వేచి చూడాలి.. రిషభ్ ఖాయమేనా? 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే ధోని, యువరాజ్‌లలో ఒక్కరికే చోటు ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ ఇదే నిజమైతే జట్టు ఇప్పటి నుంచే తమ మిడిలార్డర్‌ను పటిష్ట పరచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా యువ సంచలనం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని తుది జట్టులో తీసుకునే ఆలోచనలో కెప్టెన్ ఉన్నాడు. రిషభ్ ఇప్పటిదాకా వన్డేలు ఆడలేదు. భవిష్యత్ తారగా పిలుచుకుంటున్న అతడికి తగిన అంతర్జాతీయ అనుభవం కావాల్సి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతనికే ఎక్కువ అవకాశాలున్నాయి. పేలవ ఫామ్‌తో ఉన్న యువరాజ్ మూడో వన్డేలో కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడి స్థాయికి అది తక్కువే. ధోని మరోసారి తన బ్యాటింగ్‌లో చమక్కులు చూపించాడు. ఓపెనింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్‌లతో పాటు పేసర్లలో భువనేశ్వర్, ఉమేశ్ మెరుస్తున్నారు. జట్లు: (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, ధోని, యువరాజ్/రిషభ్, జాదవ్, పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్. విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, కైల్ హోప్, షాయ్ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్. సా. 6.30 నుంచిసోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిప్పులు చెరిగిన రిషబ్
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ ఆండ్రూస్ బౌలర్లు రిషబ్ (5/80), అలంకృత్ (3/14) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ 131 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. సంపత్ (74), సిద్ధార్థ్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... వైష్ణవ్ (47) మెరుగ్గా ఆడాడు. అన ంతరం బరిలోకి దిగిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 108 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యూష్ (53) మినహా మిగతావారు చేతులెత్తేశారు. మరో మ్యచ్‌లో మెదక్ వికెట్ తేడాతో సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్‌పై గెలుపొందింది. మొదట సెయింట్ మార్క్స్ 107 పరుగుల వద్ద ఆలౌటైంది. మెదక్ బౌలర్ అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత మెదక్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సెయింట్ మార్క్స్ బౌలర్ కపిల్ వ్యాస్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కాల్ పబ్లిక్ స్కూల్: 210/3 (పి.సిద్ధార్థ్ 51, సూర్యతేజ 52, సాత్విక్ 46); కరీంనగర్: 213/5 (రిత్విక్ సూర్య 63, రోహన్ 55 నాటౌట్). ఎ-డివిజన్ వన్డే లీగ్ ఎలిగెంట్: 182/9 (తౌసిఫ్ ఖాన్ 66, మాజిద్ 48; ధీరజ్ 4/47); కన్స్ల్ట్: 120 (మహీందర్ 50; అజయ్ రెడ్డి 7/46).