నాగబంధం విడుదలపై ప్రకటన | Nagabandham Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

నాగబంధం విడుదలపై ప్రకటన

Mar 26 2026 1:58 PM | Updated on Mar 26 2026 2:05 PM

Nagabandham Movie Release Date Announced

విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్‌ నామా రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం నాగబంధం.. తాజాగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో  కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్‌ నామా దర్శకత్వంలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుందని ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితం టీజర్‌ విడుదల తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ కోసమే రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement