పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం | Nabha Natesh Snake Story Goes Viral Ahead Of Nagabandham Movie Release, Says We Used To Eat While Snakes Crawled Around | Sakshi
Sakshi News home page

Nabha Natesh: పాములకు భయపడని టాలీవుడ్ హీరోయిన్

Jul 1 2026 2:39 PM | Updated on Jul 1 2026 3:40 PM

Actress Nabha Natesh About Snakes Fear

పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ఈమె నటించిన 'నాగబంధం' సినిమా ఈ శుక్రవారం(జూలై 03) థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)

'పాములంటే నాకు అస్సలు భయం లేదు. మాది చిక్‌మగళూరు. అక్కడ మా పూర్వీకుల ఇళ్లలో పాములు ఉండేవి. చెప్పాలంటే నేను, మా తమ్ముడు భోజనం చేస్తూ వాటిని చూసేవాళ్లం. కానీ పెద్దగా పట్టించుకునేవాళ్లం మాత్రం కాదు' అని నభా నటేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కన్నడ అమ్మాయి అయిన నభా.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ తదితర చిత్రాలు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. కరోనా టైంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు రెండు మూడేళ్ల పాటు నటనకు దూరమైంది. 

అనంతరం ఈమె తెలుగులో స్వయంభు, నాగబంధం అనే భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. 'నాగబంధం' రెండురోజుల తర్వాత రిలీజ్ కానుండగా.. స్వయంభు కూడా మరికొన్ని నెలల్లో థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement