విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శ కత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మంచిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి.
‘‘ఈ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను ప్లాన్ చేశాం. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమంతో ఈ సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నాం.
ఈ ప్రచార యాత్రలో భాగంగా తొలి కార్యక్రమాన్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. జూన్ 26న వారణాసిలో ఈ సినిమాలోని ‘వీర నాగ’ పాటను రిలీజ్ చేస్తాం. జూన్ 28న హైదరా బాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


