నభా నటేశ్ నాగబంధం మూవీ.. మరో సాంగ్ రిలీజ్ | Virat Karrna and Nabha Natesh Nagabandham Movie Sura Sura Song out now | Sakshi
Sakshi News home page

Nagabandham Movie: నభా నటేశ్ నాగబంధం మూవీ.. మరో సాంగ్ రిలీజ్

Apr 19 2026 1:54 PM | Updated on Apr 19 2026 2:05 PM

Virat Karrna and Nabha Natesh Nagabandham Movie Sura Sura Song out now

విరాట్‌ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్‌ ప్రధానపాత్రల్లో వస్తోన్న మూవీ నాగబంధం. ఈ మూవీకి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌తో పాటు టీజర్‌ కూడా చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. సుర సుర అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ, నల్గొండ గద్దర్‌, అనురాగ్‌ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను జునైద్‌ కుమార్‌, అభే కంపోజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement