నాగబంధం మూవీ.. ఆ క్యారెక్టర్‌పై నెటిజన్ల ప్రశంసలు.! | Netizens Praised Nagabandham Movie Villain role character | Sakshi
Sakshi News home page

Nagabandham Movie: నాగబంధం మూవీ.. అతనే హైలెట్‌..!

Jul 3 2026 10:22 PM | Updated on Jul 3 2026 10:24 PM

Netizens Praised Nagabandham Movie Villain role character

విరాట్ కర్ణ, నభా నటేశ్ కీలక పాత్రల్లో వచ్చిన అడ్వెంచరస్‌ మూవీ 'నాగబంధం'. అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలిరోజే మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది. ఈ చిత్రంలో  విలన్‌గా 'అబ్దాలీ' పాత్రలో  రిషబ్ సాహ్నీ నటించారు.

తాజాగా అతని గురించే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. థియేటర్‌లో  రిషబ్ సాహ్నీ ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, డామినేటింగ్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నాగబంధం' సినిమాలో రిషబ్ సాహ్నీ నటన ఒక్కటే హైలెట్‌గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

నాగబంధం చూసిన పలువురు రిషబ్ సాహ్నీ నటనను ప్రశంసిస్తున్నారు. దర్శకులు ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రల్లో రిషబ్‌ను మరింతగా చూపించాలంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. రిషబ్ సాహ్నీ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్.. అతను ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారీ ఏదో పెద్దది జరగబోతుందన్న ఫీలింగ్ కలిగిందని రాసుకొచ్చారు. అబ్దాలీ పాత్రలో ఆయన చూపించిన డామినేషన్ అద్భుతం.. ఫైటర్ తర్వాత మరోసారి తన నటనతో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మరికొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రంలో ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసిన పాత్రల్లో 'అబ్దాలీ' ఒకటిగా నిలిచిందనే చెప్పొచ్చు. 

rishab
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement