పార్వతిగా నభా నటేష్‌ | Nabha Natesh As A Parvathi In Nagabandham Movie | Sakshi
Sakshi News home page

పార్వతిగా నభా నటేష్‌

Jan 17 2026 10:36 AM | Updated on Jan 17 2026 11:01 AM

Nabha Natesh As A Parvathi In Nagabandham Movie

భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నాగ బంధం’.  ఈ మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామాలో విరాట్‌ కృష్ణ హీరోగా నటించారు. నభా నటేష్‌ హీరోయిన్‌ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆమె చేసిన పార్వతి పాత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. సంప్రదాయబద్ధంగా కనిపించే పార్వతిగా నభా లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. అభిషేక్‌ నామా దర్శకత్వంలో కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్‌ మరో కథానాయికగా నటించారు.

 ‘‘నాగబంధం సంప్రదాయంలోని పవిత్ర రహస్యాలను అన్వేషించే కథాంశంతో పురాణాలు, సస్పెన్స్, డివోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించాం. ప్రస్తుతం ΄ోస్ట్‌ ్ర΄÷డక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలి΄ారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement