నాగబంధం రెండున్నరేళ్ల ప్రయాణం: అభిషేక్‌ నామా | Abhishek Nama about Nagabandham movie | Sakshi
Sakshi News home page

నాగబంధం రెండున్నరేళ్ల ప్రయాణం: అభిషేక్‌ నామా

Jul 7 2026 1:03 AM | Updated on Jul 7 2026 1:03 AM

Abhishek Nama about Nagabandham movie

కిషోర్, అభిషేక్, విరాట్‌ కర్ణ, నభా నటేష్, నిశిత

‘నాగబంధం’ సినిమా రెండున్నరేళ్ల ప్రయాణం. ఈ చిత్రంలో మా యూనిట్‌ కష్టం ఎంతో ఉంది. ఇలాంటి కథని నమ్మి ముందుకొచ్చిన నిర్మాతలను, నటించిన హీరోను అందరూ సపోర్ట్‌ చేయాలి. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు ఫస్ట్‌ హాఫ్‌లో ఒక సాంగ్‌ని తీసేశాం. అలాగే క్లైమాక్స్‌ కూడా కొంచెం తగ్గించాం’’ అని డైరెక్టర్‌ అభిషేక్‌ నామా తెలిపారు.

విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నాగబంధం– ది సీక్రెట్‌ ట్రెజర్‌’. నిక్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో విరాట్‌ కర్ణ మాట్లాడుతూ–‘‘అనంత పద్మనాభ స్వామి స్క్రీన్‌మీద కనిపిస్తున్న సమయంలో కొందరు ప్రేక్షకులు చెప్పులు తీసి సినిమా చూస్తున్నారు.. వాళ్ల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి.

ఇంతకంటే ఎమోషన్‌ ఏముంటుంది? ‘హర హర మహాదేవ’ నినాదంతో ‘నాగబంధం’ ఆడుతున్న థియేటర్స్‌ మార్మోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది?’’ అని పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల కష్టానికి ప్రేక్షకులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నభా నటేష్‌. ‘‘మన పిల్లలకు మన చరిత్ర, సనాతన ధర్మం, పెద్దలు చేసిన త్యాగాలను తెలియజేయాలనే ‘నాగబంధం’ తీశాం’’అని నిశిత నాగిరెడ్డి తెలిపారు. ‘‘త్వరలోనే మా తర్వాతి సినిమాని ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కిషోర్‌ అన్నపురెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement