నాగబంధం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు: నిర్మాత డి.సురేశ్‌ బాబు | Producer Suresh Babu Speech at Nagabandham Pre Release Event | Sakshi
Sakshi News home page

నాగబంధం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు: నిర్మాత డి.సురేశ్‌ బాబు

Jul 2 2026 3:45 AM | Updated on Jul 2 2026 3:45 AM

Producer Suresh Babu Speech at Nagabandham Pre Release Event

అభిషేక్‌ నామా, విరాట్‌ కర్ణ, నభా నటేష్, సురేశ్‌ బాబు,

‘‘నాగబంధం’ చాలా కాస్ట్‌లీ సినిమా. నేను రషెస్‌ చూశాను. టీమ్‌ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. అభిషేక్‌ అద్భుతంగా ఈ చిత్రం తీశారు. నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చుపెట్టారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ చాలా చక్కగా వర్క్‌ చేశారు. ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత డి.సురేశ్‌ బాబు పేర్కొన్నారు. విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్‌ ట్రెజర్‌’. నభానటేష్, ఐశ్వర్యామీనన్  హీరోయిన్లుగా నటించారు. 

కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌కు డి. సురేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విరాట్‌ కర్ణ మాట్లాడుతూ–‘‘మన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకునే సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్‌ అయితే ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో వస్తాయి’’ అని చె ప్పారు అభిషేక్‌ నామా.

 ‘‘మా సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు కిషోర్‌ అన్నపురెడ్డి. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిశిత నాగిరెడ్డి. ఈ ఈవెంట్‌లో నభా నటేష్, నటుడు అంకిత్, ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ జునైద్‌ కుమార్, అభే, కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement