కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్ | Nagabandham Movie Trailer Telugu Details | Sakshi
Sakshi News home page

Nagabandham Trailer: భారీతనంతో ఆకట్టుకునేలా 'నాగబంధం' ట్రైలర్

Jun 19 2026 6:43 PM | Updated on Jun 19 2026 6:48 PM

Nagabandham Movie Trailer Telugu Details

రూ.100 కోట్ల బడ్జెట్ అనగానే సాధారణంగా పేరున్న హీరోలనే పెడుతుంటారు. కానీ ఒక సినిమాలో నటించిన అనుభవమున్న విరాట్ కర్ణ అనే కుర్రాడిని పెట్టి తీసిన చిత్రం 'నాగబంధం'. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భారీతనంతో ఇది ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)

ట్రైలర్ బట్టి చూస్తే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని స్వర్ణపుష్పం దక్కించుకునేందుకు కొందరు విలన్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో హీరో వాళ్లకు సాయపడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? హిమాలయాల్లో ఉండే నాగసాధువులు ఎందుకు వచ్చారు? లాంటి అంశాలే స్టోరీలా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపించింది. యాక్షన్, రక్తపాతం కూడా గట్టిగానే చూపించారు. నభా నటేశ్ హీరోయిన్ కాగా అభిషేక్ నామా దర్శకుడు. ఇందులో నటించిన చాలామంది కొత్తవాళ్లే. వీళ్లపై రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఇది ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement