యువర్స్
జెన్-జీ
మనమందరం కాంక్రీట్ జంగిల్‌లో బతికే జంతువులమే.. రోడ్డు మీద ఒకడు చాయ్ తాగి సిటీ బస్ ఎక్కితే... స్టార్ హోటల్‌లో హెర్బల్ టీని సగం తాగి, మినరల్ వాటర్ గురించి అనవసరపు డిస్కషన్ స్టార్ట్ చేసి, హడావిడిగా బెంజ్ కారులో రోడ్డెక్కుతాడు మరొకడు.. ఎవరి పయనం ఎటున్నా, ఎవరి గమ్యం ఎటుపోయినా మనందరికీ కామన్‌గా కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని తప్పించుకుని, ఆ అలవాట్లే మాకు లేవని చెప్పడం చాలా కష్టం.. ఒక వేళ మీరు ఈ అలవాట్లకు అతీతమైతే మీ స్కోర్ ఎంతో మీరే డిసైడ్ చేస్కోండి...
1. అలారం మోగిన తర్వాత కూడా పడుకునే అలవాటు?
జ. దీన్ని సైన్స్‌లో ‘స్నూజ్ ఆప్టిమిజమ్’ అంటారు. మోగిన అలారాన్ని ఆపి, నిద్రపోయే ఆ ఐదు నిమిషాల నిద్ర బ్రెయిన్‌కి చాలా
హాయినిస్తుంది.
2. పుస్తకాన్ని చదివితే ఐదు నిమిషాల్లో నిద్ర వస్తుంది, అయితే రీల్స్ చూస్తే రెండు గంటలైనా రాదు ఎందుకు?
జ. పుస్తకంలోని విషయం ఒక పేజీతో అర్థం కాదు..కాని రీల్స్ ప్రతి 30 సెకన్లకి మారుతుండడంతో మెదడు రిఫ్రెష్ అవుతుంది.
3. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి తిన్నా, రెండోది తిందామని ఆటోమేటిక్‌గా చూపు ఎందుకు ప్లేటు వైపు వెళ్తుంది?
జ. ఉప్పు, నూనె కలయిక అనేది మెదడులో డొపమైన్‌ను సృష్టిస్తుంది. అందుకే మొదటి ఫ్రై నోటిలోకి వెళ్లగానే రెండో ఫ్రైకి బ్రెయిన్ ఆటోపైలట్ మోడ్ ఆన్ చేస్తుంది.
4. టాయ్‌లెట్‌లో ఉన్నప్పుడే ఎందుకు ఐడియాలు ఎక్కువగా వస్తాయి?
జ. ప్రశాంతత, ఏకాగ్రత వల్ల బ్రెయిన్ డీఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ ఆన్ చేసుకుని రిలాక్స్ అవుతూ టెన్షన్ ఫ్రీగా తయారవుతుంది. అందుకే గ్రేట్ ఐడియాలు వస్తాయి.
5. మనం రోజుకి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతాం?
జ. రీసెర్చ్ ప్రకారం మనుషులు రోజుకి సగటున నాలుగు అబద్ధాలు ఆడతారు. అందులో టాప్–1 తీసుకుంటే ‘నేను ఐదు నిమిషాలలో వస్తా’.
6. అవసరం లేకపోయినా ఫోన్ చూసే అలవాటు?
జ. సైకాలజీలో దీన్ని ఫాంటమ్ వైబ్రేషన్ అండ్ ఫోమో అని అంటారు. ప్రపంచంలో ఏదో జరిగిపోతోందనే ఉత్సుకతతో మన చేతులు ఫోన్ అన్‌లాక్ చేయడానికి పరిగెడతాయి.
7. బాగా లేజీగా అయిపోయాం, రేపటి నుంచి జిమ్‌కి వెళ్తా?
జ. మెదడు శ్రమ తగ్గించుకోవడానికి ప్రదర్శించే కాగ్నిటివ్ లేజీనెస్ ఇది.. పాక్షికంగా తనని తాను బాగానే ఉన్నానని చెప్పుకోవడానికి ఇదో రకం ఉపశమనం.
8. అద్దం ఎక్కడ కనిపించినా అందం చూసుకునే అలవాటు?
జ. మనసులోని సబ్ కాన్షియస్ మైండ్ నార్సిజమ్ అండ్ విజువల్ కన్ఫర్మేషన్‌ని కోరుకుంటుంది. అందుకే ఎవరి దిష్టి తగిలినా నా గ్లామర్ తగ్గేదేలా... అని రీకన్ఫర్మ్ చేసుకోవడమే ఈ అలవాటు.
9. ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూకి ముందు మాత్రమే టాయిలెట్‌కి వెళ్లాలని ఎందుకు అనిపిస్తుంది.?
జ. భయం లేదా టెన్షన్ వచ్చినప్పుడు శరీరంలో రిలీజ్ అయ్యే అడ్రినలిన్ హార్మోన్ పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది.
10. మనం ఇష్టపడే వ్యక్తి (ఫస్ట్ క్రష్)కి మెసేజ్ చేయగానే గుండె వేగం రెట్టింపవుతుంది ఎందుకు?
జ. సైన్స్ ప్రకారం అది ప్రేమ కాదు. బ్రెయిన్‌లో హఠాత్తుగా ఎడ్రినలిన్ హార్మోన్ కంప్లీట్ బాడీకి ఇచ్చే షాక్ ఇది.


