బంధం బలపడాలంటే.. ఆధిపత్యం కాదు అనురాగం ముఖ్యం! | Husband And Wife Relationship Respect Happy Married Life | Sakshi
Sakshi News home page

బంధం బలపడాలంటే.. ఆధిపత్యం కాదు అనురాగం ముఖ్యం!

Aug 15 2026 10:01 AM | Updated on Aug 15 2026 10:13 AM

Husband And Wife Relationship Respect Happy Married Life

లైఫ్‌..

భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది రెండు విభిన్న మనస్తత్వాల కలయిక. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు చిన్నపాటి విభేదాలు ఉంటుంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. అవతలి వ్యక్తి ఆలోచనలను, అభి్రపాయాలను తక్కువ చేసి చూడటం మొదలుపెడితే మాత్రం బంధంలో చీలికలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా కాకూడదంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

కొంతమంది ’నేను నీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను’, ’అన్ని విషయాల్లోనూ నీకన్నా నాకే ఎక్కువ తెలుసు’ అనే భావనతో భాగస్వామిని చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటప్పుడు ఎదుటి వారు చెప్పేది ఎంత ముఖ్యమైనదైనా, అది వినడానికి మనసు అంగీకరించదు. ఈ క్రమంలో ఒక బంధం బలంగా ఉండాలంటే, ఆధిపత్యం చూపించడానికన్నా అనురాగంతో ఉండడం అవసరం. ఒకరి విషయాల్లో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనో లేదా ఎదుటివారికి అవగాహన లేదన్న భ్రమతోనో ‘నీకేం తెలియదు’ అని అంటుంటారు. అయితే, ఇది తరచూ సాగుతుంటే మాత్రం భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

సున్నితంగా చెప్పడం
ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ’నేను చూసుకుంటాను’ అని చెప్పడం కంటే, దీని గురించి నీ అభి్రపాయం ఏంటి? అని అడగడం మంచిది. దీనివల్ల భాగస్వామికి తాము కూడా ఈ బంధంలో ఒక ముఖ్యమైన భాగమనే నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారికి ఆ విషయంపై అవగాహన లేకపోతే, విసుక్కోకుండా సున్నితంగా వివరించాలని తెలియజేస్తున్నారు.

దంపతులిద్దరూ చర్చించుకోవడం
భార్యాభర్తల అనుబంధం అంటే ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం. ఒకరికి తెలిసిన విద్య మరొకరికి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అవతలి వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో పనులైనా, ఆర్థిక నిర్ణయాలైనా ఇద్దరూ కలిసి చర్చించు కున్నప్పుడే కదా వారి మధ్య సామరస్యత ఏర్పడేది!

బంధం బలపడడానికి...
భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందూ లేదా కఠినంగా విమర్శించడానికి బదులుగా.. వారు చేసే చిన్న పనులను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి కావాలని అనుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి వెనక్కి తగ్గడం వల్ల బంధం మరింత బలపడుతుందని తెలియజేస్తున్నారు. ఏబంధమైనా నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, అర్థం చేసుకునే స్వభావం, నమ్మకం ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతుంది. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement