త్రిష థగ్‌ లైఫ్‌ ఆరంభం

Trisha joins the set of Kamal Haasan Thug Life - Sakshi

‘థగ్‌ లైఫ్‌’ను ఆరంభించారు హీరోయిన్‌ త్రిష. ‘నాయగన్‌’ (తెలుగులో ‘నాయకుడు’) తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘థగ్‌ లైఫ్‌’. ‘జయం’ రవి, త్రిష, దుల్కర్‌ సల్మాన్, గౌతమ్‌ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మీ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు త్రిష.

సెట్స్‌లో ‘థగ్‌ లైఫ్‌’ స్క్రిప్ట్‌ను పట్టుకుని ఉన్నట్లుగా ఇన్‌స్టా స్టోరీలో త్రిష ఓ చిన్న వీడియోను షేర్‌ చేశారు. దీంతో ‘థగ్‌ లైఫ్‌’ సినిమా షూటింగ్‌లో త్రిష జాయిన్‌ అయ్యారని స్పష్టం అయింది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తవ్వగానే, నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం టీమ్‌ సెర్బియా వెళుతుందని కోలీవుడ్‌ సమాచారం. కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్, మణిరత్నం, ఏ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

త్రిషకు క్షమాపణలు చెప్పిన ఏవీ రాజు: త్రిషను ఉద్దేశించి తమిళనాడు రాజకీయ నేత ఏవీ రాజు రెండు రోజుల క్రితం చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై లీగల్‌గా ముందుకు వెళ్తానని త్రిష పేర్కొన్నారు. అనంతరం మంగళవారం రాత్రి ఏవీ రాజు స్పందించారు. తాను ఏ యాక్టర్‌నీ టార్గెట్‌ చేయాలనుకోవడం లేదని, తన మాటలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఓ వీడియోను రిలీజ్‌ చేశారు ఏవీ రాజు. 

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top