
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Tamil Nadu CM MK Stalin and TN Governor gets bomb threat.@PramodMadhav6 with more details.#TamilNadu #FirstUp | @AishPaliwal pic.twitter.com/526VQAqbIT
— IndiaToday (@IndiaToday) October 3, 2025
