లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్‌ వ్యవహారం | The viral picture of Trisha and Vijay together at a public place has sparked dating rumors and taken over social media. |Sakshi
Sakshi News home page

లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్‌ వ్యవహారం

Published Tue, Jun 25 2024 7:37 AM | Last Updated on Tue, Jun 25 2024 10:45 AM

Trisha And Vijay Photos Goes Viral In Kollywood

కోలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ (ఒక్కడు రీమేక్‌) చిత్రం ఘన విజయం సాధించింది. రీసెంట్‌గా లియో ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

కొద్దిరోజుల క్రితం విజయ్‌ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఆపై  'నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్' అంటూ ఓ ఆంగ్ల పాటను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ ఫోటో వైరల్‌ అవుతున్న సమయంలో త్రిష, విజయ్‌ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ వారు తెలుపుతున్నారు. అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వారు వైరల్‌ చేస్తున్నారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది. దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

వారిద్దరి మధ్య రహస్య స్నేహం నడుస్తుందా..? అంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి. వారు విడాకులు తీసుకోనున్నారు అనే రూమర్స్‌ కూడా వచ్చాయి. 

త్రిష విషయానికొస్తే 41 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్‌తో మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది.  చాలా కాలం క్రితం వరుణ్‌మణియన్‌ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్‌గా బ్రేక్‌ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్‌ ఎదుర్కొన్న త్రిష ఇటీవల వెండితెరపై తన సత్తా చాటుతుంది. సౌత్‌ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకే హీరోయిన్‌గా ప్రస్తుతం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 

త్రిష, విజయ్‌ ఫోటోలను కోలీవుడ్‌లో కొందరు వైరల్‌ చేస్తూ.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ అనుమానాలకు అవకాశం ఇచ్చేలా కొన్ని ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కొందరు కావాలనే ఇలాంటి పని చేస్తున్నారని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. అలాంటి ఏదైనా విషయం ఉంటే ఆయన డైరెక్ట్‌గానే చెబుతారని వారు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయం గురించి త్రిష, విజయ్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement