యానిమల్‌ చిత్రంపై త్రిష పోస్ట్‌.. నెటిజన్ల దెబ్బకు తొలగింపు | Sakshi
Sakshi News home page

యానిమల్‌ చిత్రంపై హీరోయిన్‌ త్రిష పోస్ట్‌.. నెటిజన్ల దెబ్బకు తొలగింపు

Published Tue, Dec 5 2023 10:58 AM

Trisha Krishnan Comments On Animal Movie - Sakshi

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా ఇటీవల విడుదల చేసిన చిత్రం యానిమల్. రణ్‌బీర్‌ కపూర్‌- రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ చిత్రంలో హింసాత్మక, స్త్రీ ద్వేషపూరితమైన కంటెంట్‌ ఉందంటూ విస్తృతంగా విమర్శించబడింది. యానిమల్‌లో యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ అదరగొట్టారని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా లైంగిక, గృహ హింసకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ తీవ్ర ప్రతిఘటనను ఈ చిత్రం ఎదుర్కొంది.

(ఇదీ చదవండి: రేవంత్‌ రెడ్డి ఫోటో షేర్‌ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత)

ఈ నేపథ్యంలో నటి త్రిష కృష్ణన్ ఇటీవల యానిమల్‌ చిత్రాన్ని సోషల్ మీడియాలో సమీక్షించి, దానిని 'కల్ట్'గా అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇది నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై త్రిష చేసిన కామెంట్‌ సోషల్ మీడియాలో  బాగా వైరల్‌ అయింది. ఈ సినిమాపై 'కల్ట్‌... Pppppppaaaaaahhhhhh.' అని తన ఎక్స్‌ పేజీలో రాసింది. అయితే త్రిష కామెంట్‌పై సోషల్ మీడియాలో పలువురు  తప్పుబట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను తొలగించింది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దానిని  స్క్రీన్‌షాట్‌ను తీశారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

లియో చిత్రంలో త్రిషతో 'బెడ్‌రూమ్ సీన్' లేకపోవడంతో నిరాశ చెందాననని మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అతను గతంలో ఇతర మహిళా నటీనటులతో అనేక 'రేప్ సన్నివేశాలలో' తన ప్రమేయం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని ప్రకటనపై త్రిష స్పందిస్తూ తన అసమ్మతిని ట్వీట్ చేసి భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. పలువురు ప్రముఖులు కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాపై త్రిష ప్రశంసలు కురిపించడంతో మరోసారి ఇంటర్నెట్ దద్దరిల్లింది.

గృహ హింస, లైంగిక హింసను కలిగి ఉన్న సినిమాని త్రిష మెచ్చుకున్నారని చాలా మంది విమర్శించారు. అయితే, మరికొందరు త్రిషను సమర్థించారు. యానిమల్‌లో ఎక్కువగా బోల్డ్‌, హింసకు సంబంధించిన సీన్లే ఉన్నాయి. అలాంటి సినిమాను త్రిష ఎందుకు మెచ్చుకున్నారు. ఈ సినిమాను కొందరు పురుషులు కూడా విమర్శిస్తున్నారు.. అలాంటిది త్రిష ఎందుకు హైప్ చేస్తున్నారని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు.  ఒకవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూనే మరోవైపు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే చిత్రానికి మద్దతిస్తున్నట్లు మరోక నెటిజన్‌ తెలిపాడు.  అయితే, కొంతమంది త్రిషకు మద్దతుగా కామెంట్‌ చేశారు. మన్సూర్ అలీ ఖాన్‌తో ఆమెకు ఉన్న వివాదాన్ని తీసుకొచ్చి యానిమల్‌ చిత్రంపై ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని పోల్చకూడదని వాదించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement