'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు | Sakshi
Sakshi News home page

'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు

Published Fri, Feb 23 2024 7:47 AM

Two Heroines Enter In Vishwambhara movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్‌ వేగంగా ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ. కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మెగా​స్టార్‌ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత వారిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

'విశ్వంభర'లో ఇషా చావ్లా, సురభి అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరిపై కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్‌గా వీరిద్దరితో షూటింగ్‌ కూడా ప్రారంభించారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. అందులో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి కూడా పాల్గొంటారని టాక్‌. ప్రేమ కావాలి,రంభా ఊర్వసి మేనక వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. 

సినిమాలో వీరిద్దరి పాత్ర ఎంత పరిధి వరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా దీనిని వశిష్ఠ డైరెక్ట్‌ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ భారీ బడ్జెట్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement