ఆ ఓటీటీలోకి ‘థగ్‌ లైఫ్‌’ .. స్ట్రీమింగ్‌ అప్పుడేనా? | Thug Life On OTT: Where To Watch Kamal Haasan Thug LIfe Movie | Sakshi
Sakshi News home page

భారీ ధరకు ‘థగ్‌ లైఫ్‌’ ఓటీటీ రైట్స్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Jun 5 2025 4:46 PM | Updated on Jun 5 2025 6:22 PM

Thug Life On OTT: Where To Watch Kamal Haasan Thug LIfe Movie

కమల్‌ హాసన్‌- మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష,అభిరామి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్ప​ందన లభిస్తోంది. కమల్‌కు ‘నాయకుడు’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ పడుతున్నారు. మణిరత్నం మార్క్‌ సినిమాలో కనిపించేలేదని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఇలా మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. (థగ్‌ లైఫ్‌ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

భారీ ధరకు ఓటీటీ రైట్స్‌
38 ఏళ్ల తర్వాత కమల్‌-మణిరత్నం కలయికలో వచ్చిన చిత్రం కావడంతో థగ్‌లైఫ్‌పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్‌  ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ. 149 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్‌ రైట్స్‌ని స్టార్‌ విజయ్‌ టీవీ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేది అప్పుడేనా.. 
థియేటర్స్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలనే ఒప్పందంలో నెట్‌ ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు చేసిందట. ఈ లెక్కన ఆగస్ట్‌ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే స్వతంత్ర దినోత్సవం(ఆగస్ట్‌ 15) కానుకగా ఆగస్ట్‌ 7న  ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని నెటిఫిక్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement