థ్రిల్లింగ్‌ ఐడెంటిటీ | Telugu Version of Identity to Arrive in Theatres on Jan 24th | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ ఐడెంటిటీ

Jan 19 2025 12:56 AM | Updated on Jan 19 2025 12:57 AM

Telugu Version of Identity to Arrive in Theatres on Jan 24th

టొవినో థామస్, త్రిష, వినయ్‌ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఐడెంటిటీ’. దర్శక ద్వయం అఖిల్‌ బాయ్, అనాస్‌ ఖాన్‌ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, రాయ్‌ సిజె నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న మలయాళంలో రిలీజైంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

కాగా ఈ సినిమా అదే టైటిల్‌తో తెలుగులో ఈ నెల 24న విడుదల కానుంది. మూవీ మాక్స్‌ శ్రీనివాస్‌ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్‌ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement