'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

'విశ్వంభర'లో అడుగు పెట్టిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌

Published Mon, Feb 5 2024 11:22 AM

Trisha Krishnan Enter In Vishwambhara Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మెగా​స్టార్‌ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు.

చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్‌ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్‌ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్‌ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.


ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్‌ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది.

సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement