'విశ్వంభర' టీజర్‌ తేదీని ఫిక్స్‌ చేసిన మెగాస్టార్‌ | Viswambara Movie Teaser Release Date Locked | Sakshi
Sakshi News home page

'విశ్వంభర' టీజర్‌ తేదీని ఫిక్స్‌ చేసిన మెగాస్టార్‌

Oct 11 2024 6:50 PM | Updated on Oct 11 2024 6:53 PM

Viswambara Movie Teaser Release Date Locked

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం  ‘విశ్వంభర’.  సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. దసర సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక పోస్టర్‌తో అభిమానులతో పంచుకున్నారు.

దసర సందర్భంగా అక్టోబర్‌ 12న విశ్వంభర టీజర్‌ విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 10:49 గంటలకు ప్రేక్షకులను విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.

చిరంజీవి ఫస్ట్‌ లుక్‌తోనే ప్రేక్షకులను మెప్పించారు. క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.  చిరంజీవి చరిష్మాటిక్‌ ప్రెజెన్స్ తో  మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్‌ యాక్షన్  సీక్వెన్స్ విజువల్‌ వండర్‌లా ఉండబోతోందని ఇప్పటికే చిత్రయూనిట్‌ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement