చిరంజీవికి జోడీగా సీనియర్‌ హీరోయిన్‌కే ఛాన్స్‌ | Sakshi
Sakshi News home page

చిరంజీవికి జోడీగా సీనియర్‌ హీరోయిన్‌కే ఛాన్స్‌

Published Sun, Dec 10 2023 9:23 AM

Trisha Krishnan Get Chance Chiranjeevi Movie - Sakshi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. మెగా 156గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే పేరు ఖారారు చేయనున్నారు. ఈ చిత్రాన్ని  ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా... యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభమే పోరాట ఘట్టాలతో మొదలైంది.  ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకని చిరంజీవి  ఇటీవల విరామం తీసుకుని హైదరాబాద్ వచ్చారు.

ఈ సినిమా  ప్రత్యేకమైన ఓ ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుంది. చిరంజీవి సరసన పలువురు కథానాయికలు నటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒక్కరే హీరోయిన్ అని గతంలోనే బయటకు వచ్చింది.  కానీ ఇప్పుడు తెరపైకి త్రిష పేరు బయటకు వచ్చింది. అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ ఛాన్స్‌ త్రిషకు దక్కినట్లు తెలుస్తోంది.  పొన్నియన్ సెల్వన్,లియో వంటి చిత్రాలతో పాన్‌ ఇండియా రేంజ్‌లో త్రిషకు కూడా గుర్తింపు ఉంది. కానీ చాలా రోజుల నుంచి ఆమె టాలీవుడ్‌లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తుంది. మెగాస్టార్‌ చిత్రంతో వస్తున్న ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకోవాలని చూస్తుందట.

అప్పట్లో, త్రిష, చిరంజీవి కాంబినేషన్‌లో స్టాలిన్‌ చిత్రం ద్వారా మెప్పించారు. తర్వాత ఆచార్య సినిమాతో మరోసారి ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ  క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నారు.  ఏది ఏమైనా చిరు సినిమాలోకి త్రిష ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మెగా 156లో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement