'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ ‍ వైరల్! | Sakshi
Sakshi News home page

Vishal: మీ ఇంట్లో మహిళలు క్షేమంగా ఇంటికి రావాలి: విశాల్‌

Published Tue, Feb 20 2024 9:49 PM

Vishal Responds On Derogatory Comments On Heroine Trisha - Sakshi

స్టార్ హీరోయిన్‌ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్‌పై ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక  మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విశాల్‌ తన ట్వీట్‌లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్‌ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' ‍అని రాసుకొచ్చారు.

ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని  కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్‌గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement