
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సాయి ధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.
అవును.. నేను, విశాల్ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..
ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది.
Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️
pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025