
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది.
దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్‌లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.
ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.
పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్‌కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి.
-సిమ్మాదిరప్పన్న.