
మామిడి పచ్చడి తయారు చేసిన డిప్యూటీ సీఎం సతీమణి
మధిర: మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్‌మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్