
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
ఆ వీడియోలో లండన్‌లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్‌లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు.
అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!.
(చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..)