లాయర్‌గా విజయ్‌ ఆంటోని.. విలన్‌గా మేనల్లుడు | Vijay Antony And 26th Movie Courtroom Drama Concept Reveal | Sakshi
Sakshi News home page

లాయర్‌గా విజయ్‌ ఆంటోని.. విలన్‌గా మేనల్లుడు

May 21 2025 10:56 AM | Updated on May 21 2025 11:10 AM

Vijay Antony And 26th Movie Courtroom Drama Concept Reveal

కోలీవుడ్‌ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్‌ ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన ఇప్పటికే నాలుగైదు చిత్రాలు చేస్తున్నారు. ఈయన నటిస్తున్న అగ్ని సిరైగల్‌, వళ్లి మయిల్‌, ఖాకీ, మార్గన్‌, శక్తి తిరుమగన్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రానికి సిద్ధమవుతున్నారు . దీనికి లాయర్‌ అనే టైటిల్‌ ను నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ని సోమవారం విడుదల చేశారు. దీన్ని విజయ్‌ అంటాని ఫిలిం కార్పొరేషన్‌ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి జెంటిల్‌ ఉమెన్‌ చిత్రం ఫేమ్‌ జోశ్వా సేతురామన్‌ కథా, దర్శకత్వం బాధ్యతలను వహించనున్నారు. 

ఇది న్యాయస్థానం నేపథ్యంలో సాగే వైద్య భరిత కథాచిత్రంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఒక విభిన్నమైన కేసు ఇతి వృత్తంతో సాగే కథను దర్శకుడు రాశారని నిర్మాతలు తెలిపారు. ఇంతవరకు తెరపై చూడనటువంటి న్యాయస్థానాన్ని , దాని విధి విధానాలను సరికొత్తగా తెరపై ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందని పే ర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్‌ ఆంటోనికి వ్యతిరేక పాత్రలో ఇండియాలోనే పాపులర్‌ అయిన ఓ నటి నటించనున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి అయినట్లు, త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను అతి త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఈ మూవీని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ  నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు విలన్‌గా నటించనున్నారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మార్గన్‌లో విజయ్‌కు పోటీగా అజయ్ దీషన్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే తన మేనల్లుడుని విజయ్ ఆంటోనీ పరిచయం చేస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement