‘లవ్‌ గురు’ మూవీ టీమ్‌ బంపరాఫర్‌.. ఫ్రీగా ఫ్యామిలీ టూర్‌! | Vijay Antony's 'Love Guru' Team Offers Family Trip To Audience | Sakshi
Sakshi News home page

Love Guru : ‘లవ్‌ గురు’ మూవీ టీమ్‌ బంపరాఫర్‌.. ఫ్రీగా ఫ్యామిలీ టూర్‌!

Apr 14 2024 12:23 PM | Updated on Apr 14 2024 12:36 PM

Vijay Antony Love Guru Team Offers Family Trip To Audience - Sakshi

తమ సినిమాను చూస్తే ఫ్రీగా మలేషియా, కశ్మీర్‌, ఊటీ విహార యాత్రకు తీసుకెళ్తామని చెబుతోంది ‘లవ్‌ గురు’ టీమ్‌. విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 11న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రోజు రోజుకూ చేరువవుతోంది. ఈ చిత్రం మరింత మందికి చేరువయ్యేలా చేసేందుకు మేకర్స్‌ ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంతమందిని  ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని "లవ్ గురు" టీమ్ తెలిపింది.

నేటి(ఏప్రిల్‌ 14)బ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. "లవ్ గురు" సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి  థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం "లవ్ గురు" సినిమా టీమ్ కల్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement