
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

7సీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.















