
స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ గత కొన్నేళ్లుగా హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకైతే 'బిచ్చగాడు' హీరోగా మాత్రమే తెలుసు. ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో జనాల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)
ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ కూడా క్లారిటీ ఇస్తారేమో. సాధారణంగా మనం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తుంటాం కదా. ఇది ఆ కోవలోకే వస్తుంది. స్విమ్మర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ కుర్రాడు.. అమ్మాయిలకు ఓ రకమైన డ్రగ్ ఇచ్చి చంపుతుంటాడు. దీని వల్ల శరీరమంతా నల్లగా మారి చనిపోతుంటారు.
హీరో అయిన పోలీస్ కూడా దీని బారిన సగం పడతాడు. అంటే సగం శరీరం నల్లగా మారి ఉంటుంది. సదరు పోలీసు.. దొంగని ఎలా పట్టుకున్నాడు? అసలు అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాన్ని కనిపెట్టాడా లేదా? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం మంచి క్రేజీగా ఉంది. మరి ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ అవుతుందా? ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి? జూన్ 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో విలన్‌గా చేసిన అజయ్ దిశాన్.. విజయ్ ఆంటోనికి సొంత మేనల్లుడే కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)