
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆషాడమాసం సీజన్ నడుస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం శుభకార్యాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళ నటుడు అర్జున్ చిదంబరం పెళ్లి చేసుకోగా.. మరో తమిళ నటి కూడా కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. వీడియోని కూడా పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)
చెన్నైకి చెందిన రిత్విక.. 2013లో వచ్చిన పరదేశి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తర్వాత మద్రాస్, కబాలి, టార్చ్ లైట్, 800 చిత్రాలతో పాటు రీసెంట్‌గా వచ్చిన ఎలెవన్, డీఎన్ఏ మూవీస్ కూడా చేసింది. ఇప్పుడు ఈమె.. వినోద్ లక్ష‍్మణ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి డేట్ సహా ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
సినిమాలతో పాటు రిత్విక.. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. తమిళ బిగ్‌బాస్ 2వ సీజన్ లో పాల్గొంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ విజేతగా నిలిచింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే నటిగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.
(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)