రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్‌.. త్రిష కీలక నిర్ణయం! | Heroine Trisha Takes A Step On Political Leader Comments | Sakshi
Sakshi News home page

Trisha: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. కీలక పరిణామం!

Feb 22 2024 12:57 PM | Updated on Feb 22 2024 1:09 PM

Heroine Trisha Takes A Step On Political Leader Comments - Sakshi

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్‌ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. 

తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది.  ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్‌లో పంచుకున్నారు. తన లీగల్‌ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. 

కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ అసభ్యకర కామెంట్స్‌ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్‌ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement