బెంగళూరు టీమ్‌పై నటి వ్యంగ్య పోస్ట్‌.. ఆ రెండేళ్లు మర్చిపోయారా? అంటూ సెటైర్లు! | Kollywood Actress Kasthuri Shankar Tweet On RCB, Gets Negative Comments | Sakshi
Sakshi News home page

Kasthuri Shankar: ఆర్సీబీ ఓటమిపై కస్తూరి పోస్ట్‌.. అప్పుడే మర్చిపోయారా అంటూ సెటైర్లు!

May 26 2024 4:05 PM | Updated on May 26 2024 4:24 PM

Kollywood Actress Kasthuri Shankar Tweet On RCB, Gets Negative Comments

తమిళ నటి కస్తూరి 90వ దశకంలో హీరోయిన్‌గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. సామాజిక, రాజకీయ అంశాల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఐపీఎల్‌ టీం బెంగళూరు ఓటమిపై పోస్ట్‌ పెట్టింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ విషయంపై ప్రముఖ కోలీవుడ్‌ నటి కస్తూరి తన ట్విటర్‌లో ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్‌ చేసింది. చాలా ఏళ్లుగా ఈ విషయం అక్కడి వారికి తెలుసు అంటూ బెంగళూరు కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ పిక్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా 'ఈసాలా కూడా కప్‌ ఇల్లా' అంటూ కించపరిచేలా క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది.

అయితే ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్టుకు కౌంటర్‌గా కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్‌కే టీమ్‌లా రెండేళ్లు మా టీమ్ బ్యాన్‌ కాలేదని గుర్తు చేస్తున్నారు. మీ టీమ్‌ అంతా ఫిక్సింగ్ అంటూ కస్తూరిని ట్రోల్‌ చేస్తున్నారు.  మీ టీమ్‌ చెన్నై ఫిక్సింగ్‌ కింగ్స్‌ అంటూ నెటిజన్స్‌ పెద్దఎత్తున ఆడేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement