మగాడిలా మారిపోవాలని ఉంది.. త్రిష | Sakshi
Sakshi News home page

ఒక్క రోజు అయినా మగాడిలా ఉండాలని ఉంది: త్రిష

Published Sun, May 26 2024 9:51 AM

Trisha Says She Want To Be Like A Male For One Day

కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కుడి ఎడమైతే ఎలా ఉంటుంది? చాలా తమాషాగా ఉంటుంది కదూ. చైన్నె బ్యూటీ త్రిష కోరిక కూడా అలాంటి విచిత్రమైనదే. నటిగా రెండు దశాబ్దాల అనుభవం. మధ్యలో ఎత్తుపల్లాలు ఎదురైనా, నేటికీ ఎవర్‌గ్రీన్‌ హీరోయినే. ఇప్పపటీకి మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలరే. ఇదీ త్రిష రికార్డ్‌. గ్లామర్‌ పాత్రలకై నా, ఉమెన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలకై నా, ఏ భాషలోనైనా రెడీ అంటూ తన సత్తాను చాటుతున్న ఈ సంచలన బహుభాషా నటి త్రిష.

ప్రస్తుతం తమిళంలోనే అజిత్‌ సరసన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్‌ చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన రామ్‌, టోవినో థామస్‌కు జంటగా ఐడెంటిటి, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఏక కాలంలో ఐదు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఏకై క నటి త్రిషనే అయ్యుంటారు. ఈమె ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

అందులో తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నారు. అదేమిటంటే తాను ఒక్క రోజు పురుషుడిగా ఉండాలన్నారు. ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుంది. అతని శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుందన్నారు. ఈ విషయం గురించి తన తల్లితో పదే పదే చెబుతుంటానని అన్నారు. ఆమె కోరిక నిజంగా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది కదూ!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement