డబుల్‌ ధమాకా | Trisha Birthday Treat: New Poster from Vishwambhara Unveiled | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

May 5 2025 1:07 AM | Updated on May 5 2025 1:07 AM

Trisha Birthday Treat: New Poster from Vishwambhara Unveiled

చిత్ర పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ బిజీగా దూసుకెళుతున్నారు త్రిష.  తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న త్రిష పుట్టినరోజు మే 4న. ఈ సందర్భంగా డబుల్‌ ధమాకాలా ఆమె నటిస్తున్న ‘విశ్వంభర, థగ్‌ లైఫ్‌’ సినిమాల నుంచి లుక్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

విక్రమ్‌ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఆదివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె నటించిన అవని పాత్ర లుక్‌ను రివీల్‌ చేశారు. అదే విధంగా కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ నుంచి త్రిషపోస్టర్‌ని, అలాగే తొలి సింగిల్‌ ‘జింగుచు...’ పాటను కూడా విడుదల చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యంగా అందించగా, శ్రీకృష్ణ, మంగ్లీ, ఆశిమా మహాజన్, వైశాలీ సామంత్‌ ఆలపించారు. ఈ సినిమా జూన్‌ 5న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.   

Advertisement
 
Advertisement
Advertisement