స్టార్‌ హీరోతో రిలేషన్‌ .. ప్రేమపై త్రిష పోస్ట్‌ వైరల్‌ | Trisha Drip Interesting Post About Love | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో రిలేషన్‌ .. ప్రేమపై త్రిష పోస్ట్‌ వైరల్‌

Jun 24 2025 5:02 PM | Updated on Jun 24 2025 5:57 PM

Trisha Drip Interesting Post About Love

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ప్రేమలో ఉన్నారనే రూమర్‌ గత కొంతకాలంగా అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్‌ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్‌ బర్త్‌డే రోజు త్రిష అతని ఫోటో షేర్‌ చేస్తూ విషెస్‌ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్‌ సింబల్‌ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్‌ అయింది.

తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్‌ని త్రిష తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో ప్రేమను కన్ఫర్మ్‌ చేసిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్‌ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

త్రిష కెరీర్‌ విషయానికొస్తే. ఇటీవల థగ​్‌లైఫ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. 

విజయ్ విషయానికొస్తే..  తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement