breaking news
Jananayakudu
-
‘జననాయకన్’ చూస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది
సాక్షి, చెన్నై : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విజయ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సీఎం అయినా తీరని కష్టాలు
-
స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్‌డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్‌ని త్రిష తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్‌లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)


