'థగ్‌ లైఫ్‌' హిట్‌ సాంగ్‌.. వీడియో వర్షన్‌ వచ్చేసింది | Muththa Mazhai Video Song Out from Thug Life Movie | Sakshi
Sakshi News home page

'థగ్‌ లైఫ్‌' హిట్‌ సాంగ్‌.. వీడియో వర్షన్‌ వచ్చేసింది

Jun 15 2025 4:29 PM | Updated on Jun 15 2025 4:53 PM

Muththa Mazhai Video Song Out from Thug Life Movie

కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌ సినిమా 'థగ్‌ లైఫ్‌'.. జూన్‌ 5న విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం బాగుందన్నప్పటికీ సినిమా స్టోరీ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు.  అయితే, ఈ మూవీలో సూపర్‌ హిట్‌ సాంగ్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో  శింబు, త్రిష, అభిరామి, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ తండ్రి ఎన్‌. సుధాకర్‌ రెడ్డి విడుదల చేశారు.

థగ్‌ లైఫ్‌ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో సింగర్‌ చిన్మయి పాడిన 'ముత్తా ముజై' తమిళ్‌ వర్షన్‌ పాటా బాగా వైరల్‌ అయింది. అదే పాటను సినిమాలో మాత్రం సింగర్‌ ఢీ పాడింది. తెలుగు వర్షన్‌లో చిన్మయి ఆలపించింది.  ప్రస్తుతం రెండు భాషలలో వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement