
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్‌మీడియాలో ట్రైలర్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్‌రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు.

ముద్దు సీనుతో వైరల్
‘థగ్ లైఫ్’ ట్రైలర్‌లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్‌లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్‌కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తుంది.
అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్‌లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్‌గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.

అభిరామి ఎవరు..?
కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్‌కు తమిళ వెర్షన్‌లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది.