
కమల్‌హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు.
(ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)
కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష‍్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.