'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష | Trisha Krishnan Next Movie With RJ Balaji | Sakshi
Sakshi News home page

'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష

Jun 1 2024 8:03 AM | Updated on Jun 1 2024 11:55 AM

Trisha Krishnan Next Movie With RJ Balaji

నయనతార 'అమ్మోరు తల్లి'గా  ప్రేక్షకులను మెప్పించింది. ఆర్‌.జె.బాలాజీ, శరవణన్‌ డైరక్టర్స్‌గా తొలి సినిమాగా 'అమ్మోరు తల్లి'ని తెరకెక్కించారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్‌'గా తెరకెక్కిన సినిమాకు ఇది డబ్బింగ్‌. 2020లో డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయింది. ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్‌ తీయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు.

భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్‌ మెప్పించింది. అయితే, సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్‌ దక్కినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నాయి. త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇలాంటి సినిమా ఇదే మొదటిది అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర,థగ్‌లైఫ్‌, రామ్‌ వంటి చిత్రాల షూటింగ్‌ పనుల్లో ఆమె ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement