
ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేష్ కొత్త (Venky 77) సినిమాను ప్రారంభించారు. నేడు దర్శకుడు త్రివిక్రమ్‌తో వెంకీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వెంకీ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్‌గా త్రిష, రుక్ష్మిణీ వసంత్, నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఇద్దరు నటించనున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

వెంకటేష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మీనాతో కలిసి ఓ సినిమా (దృశ్యం 3) చేయనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు.
𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 - #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/NvxQ3pnMPC
— Haarika & Hassine Creations (@haarikahassine) August 15, 2025