హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్! | Sakshi
Sakshi News home page

Mansoor Ali Khan: పరువు నష్టం దావా కేసులో నటుడు మన్సూర్‌కి ఎదురుదెబ్బ

Published Mon, Dec 11 2023 7:33 PM

Madras High Court Slams Mansoor Ali Khan On Trisha Controversy - Sakshi

కొన్నిరోజుల ముందు త్రిష-మన్సూర్ వివాదం.. ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా 'లియో' మూవీ గురించి మాట్లాడిన నటుడు మన్సూర్.. ఓ సీన్‌ చూస్తున్నప్పుడు హీరోయిన్ త్రిషని బలత్కారం చేయాలనిపించిందని చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. చాలామంది మన్సూర్‌ కామెంట్స్ ఖండిస్తూ, త్రిషకు అండగా నిలిచారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?)

అయితే త్రిషకు సపోర్ట్ చేసిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో మన్సూర్ అస్సలు సైలెంట్‌గా ఉండలేదు. తనని విమర్శించిన చిరు, ఖుష్బూతో పాటు త్రిషపై పరువు నష్టం దావా కేసు వేశాడు. ఈ వ్యవహారంలో తన అమయాకుడినంటూ హైకోర్టుని ఆశ్రయించాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మన్సూర్‌కి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చింది.

'పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో హీనమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ త్రిష నీపై కేసు పెట్టాలి. మీకు(మన్సూర్ అలీఖాన్) వివాదాల్లో తలదూర్చడం అనే అలవాటు ఉంది. ప్రతిసారి అలా చేయడం.. ఆ తర్వాత వచ్చి అమాయకుడినని అనడం అలవాటైపోయింది' అని మన్సూర్ కేసుపై మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఇప్పటికైనా మన్సూర్ మారతాడా అనేది సందేహమే?

(ఇదీ చదవండి: మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్)

Advertisement
 
Advertisement