మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్ | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మొన్న హీరోకి.. ఇప్పుడు కొరియోగ్రాఫర్‌కి గాయం

Published Mon, Dec 11 2023 6:08 PM

Choreographer Brinda Leg Injury In Kannappa Movie Shooting - Sakshi

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌‌లో జరుగుతోంది. చిత్రీకరణ సంగతలా పక్కనబెడితే వరస అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హీరో గాయపడగా.. ఇప్పుడు సాంగ్ తీస్తున్న సమయంలో టైంలో స్టార్ కొరియోగ్రాఫర్ గాయపడింది. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారు. ఇంతకీ ఏం జరిగింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)

గతంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో 'కన్నప్ప' మూవీ వచ్చింది. ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు కన్నప్ప మూవీ తీస్తామని మంచు విష్ణు చాలారోజుల నుంచి చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సీన్స్ తీస్తున్నారు. అయితే నవంబరు మొదట్లో హీరో విష్ణు గాయపడ్డాడు. డ్రోన్ తగలడంతో విష్ణు మోచేతికి గాయమైంది. ఇది అయిపోయిందనుకునేలోపు ఇప్పుడు సెట్‌లో స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ కాలికి ఫ్రాక్టర్ అయింది.

ఓ పాట కోసం స్టెప్స్ కంపోజ్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ మధ్యలో నిలిపేశారు. అలానే ఆమెని కూడా కొన్నిరోజులు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ సూచించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)

Advertisement
Advertisement