విశ్వంభర యాక్షన్ | Chiranjeevi Shooting For Vishwambhara Climax Under Action Choreographer Anl Arasu | Sakshi
Sakshi News home page

విశ్వంభర యాక్షన్

Aug 5 2024 3:32 AM | Updated on Aug 5 2024 3:32 AM

Chiranjeevi Shooting For Vishwambhara Climax Under Action Choreographer Anl Arasu

చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

 ‘‘చిరంజీవి చరిష్మాటిక్‌ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ యాక్షన్  సీక్వెన్స్ విజువల్‌ వండర్‌లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్‌ కానుంది. 

చిరంజీవి కోటి విరాళం 
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు.  

అల్లు అర్జున్‌ 25లక్షల విరాళం
వయనాడ్‌ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్‌ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.
సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement